రిషికేశ్ రెడ్డి ని యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ...

 పెంజెర్ల గ్రామ వాస్తవ్యులు కొత్తూరు మండలం,పాత మహబూబ్ నగర్ జిల్లా,ఇప్పటి రంగారెడ్డి జిల్లాకు చెందిన యువ నాయకులు, యువ కిశోరం అడ్వొకేట్ మామిడి రిషికేశ్ రెడ్డి ని యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గా


నియమిస్తూ  యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు B.V శ్రీనివాస్ నియామక పత్రం అందజేశారు. యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా నియమించబడిన అడ్వకేట్ మామిడి రిషికేశ్ మాట్లాడుతూ తనను ,తన పనితనాన్ని నమ్మి  ఇంతటి బాధ్యతను అప్పగించిన జాతీయ అధ్యక్షులు B.V .శ్రీనివాస్ గారికి , యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి గారికి ,రాష్ట్ర ఇంచార్జ్ సుమయత అబ్రెజ్ గారికి అలాగే రవీందర్ రాజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ,వారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని,  అలాగే కాంగ్రెస్ పార్టీ మరియు యువజన కాంగ్రెస్ బలోపేతం కొరకు కృషి చేస్తానని ఎల్లవేళలా ఈ సందర్బంగా తెలియజేసారు..