నిన్నటి విశాఖ డాక్టర్ సుధాకర్ ఘటన అవాంచనీయం,బాదాకరం.

 


   నిన్నటి విశాఖ డాక్టర్ సుధాకర్ ఘటన అవాంచనీయం,బాదాకరం.ఒక దళిత మేధావి, ప్రశ్నించే కంఠం నిన్నటి ఘటన జగుప్సాకరం,జాలికరమైన ఘటనగా దళిత ప్రజానీకం భావిస్తున్నారు. అతని పై జరిగిన దాడి గూర్చి మాట్లడటాని ఒకింత సందేహం. మాట్లాడితే ఇటువంటి ప్రవర్తన కలిగిన వారిని కూడా ధళిత పేరిట సమర్దిస్తారా!అనుకుంటారేమొ జంకుతున్నారు.డాక్టర్ గారి ప్రశ్నించే స్వభావాన్ని పౌరహక్కుల సంఘంగా మేం పూర్తిస్థాయిలో మద్దత్తునిస్తున్నాం.అయితే డాక్టర్ గారి బాష లో,
 రిప్రజెంటేషనన్ లో అభ్యంతరాలున్నాయి.డాక్టర్ గారు మరీ పోలీసులు ప్రజలను మాట్లాడరాని బాష మాట్లాడారు. ఈ బాష మనలో ఎవరు మాట్లడిన తప్పే.అయితే ఒక డాక్టర్ ఆ బాష మాట్లాడటాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.అతను మద్యం సేవించి నందువల్ల ఆవిధంగా ప్రవర్తించటం ప్రజలు బహిరంగంగా సమర్దించలేక పోతున్నారు. "నిరసన" తెలపటానికి డాక్టర్ గారు ఎంచుకన్న రూపం ఆక్షేపణీయమే. దీన్ని సాకుగా తీసుకుని డాక్టర్ సుధాకర్ ను మరిన్ని వేదింపులకు గురిచేయటాన్ని పౌరహక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది. సుధాకర్ లాంటి ప్రశ్నించే వారిని. పిచ్చివాడని ముద్రవేయటం రాష్ట్ర ప్రభుత్వపు పిచ్చి చర్య. ఇప్పటి వరకూ తన డ్యూటీ లో ఎటువంటి రిమార్కు,ఆరోపణలు లేని వ్యక్తి ఒక్కసారిగా పిచ్చి వాడిగా ఎట్లా మారారు.ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాదానం,సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. తద్వారా ప్రభుత్వ వ్యతిరేకత మూటగట్టుకుంటుంది.డాక్టర్ సుధాకర్ ప్రభుత్వాన్ని విమర్శించక ముందు ఆయన ఒక మంచి డాక్టర్.
1)డాక్టర్ సుధాకర్  పై మోపిన అన్నికేసులు ఎత్తివేయాలి!
2) అతని సస్పేన్షన్ ను ఎత్తివేయాలి!      3) సంబంధిత పోలీసు లపై చర్యలు తీసుకోవాలి.